జమ్ములో ఘోర ప్రమాదం

భారీ వరదలతో జమ్ముకాశ్మీర్ చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటికే భారీ వర్షాలకు అన్ని నదులు, కాల్వలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. కిష్టివార జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో 4 మృతి చెందగా.. మరో 40 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం 20 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా శ్రీనగర్ తరలించారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది.