‘తలైవి’ సినిమాకు హైదరాబాద్‌ నిధులు

Thalaivi movie latest news

 

జయలలిత జీవిత చరిత్రగా ఆధారంగా తలైవి సినిమాకు హైదరాబాద్‌ నుంచి అక్రమంగా నిధులు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిధుల తరలింపుపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. నిర్మాత విష్ణువర్థన్‌ ఇందూరి, బ్రిందా ప్రసాద్‌పై ఈ నెల 6న విబ్రి మీడియా కార్తీక్‌ ఫిర్యాదు చేశాడు. తనకు తెలియకుండానే కుట్రపూరితంగా రూ.75 లక్షలు బదిలీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్‌ ఫిక్చర్స్‌కి నిధులు మళ్లింపు జరిగినట్లు చెబుతున్నాడు.