కాంగ్రెస్ నేతలకు పదవి వ్యామోహం ఎంతుందో గత వారం రోజుల రాజకీయాలను చూస్తే అర్థం అవుతుంది. రేపో మాపో పీసీసీ, అధ్యక్ష ప్రకటన వస్తుందన్న సమయంలోనూ, అంతకు ముందు ఉత్తమ్ రాజీనామా చేసిన తర్వాత ప్రతిరోజు మీడియా ముందు కాంగ్రెస్ నేతల హాడావిడి అంతా ఇంతా కాదు. కానీ పీసీసీ రేస్ సాగర్ ఎన్నిక వరకు వాయిదా పడటంతో కాంగ్రెస్ మైకులు మూగబోయాయి.
ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రభుత్వం విస్మరిస్తుందని కేటీఆర్, ఎమ్మెల్యేలపై రేవంత్ ఒక్కడే మండిపడ్డారు. ఇటు భట్టి రైతు దీక్షతో ఇందిరాపార్క్ లో హాడావిడి చేసే ప్రయత్నం చేసినా టార్గెట్ కేసీఆర్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ మా నాయకులకకు పదవుల భర్తీకి ముందే నోరు వస్తుందని, పదవి పంపకాలు ఆగేసరికి ప్రభుత్వాన్ని విస్మరించే నేతలే లేకుండా పోయారని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని, మరోవైపు ఎన్నికలు వస్తున్నాయని కానీ ఇవేవి మా నేతల దృష్టికి రావటం లేదని మండిపడుతున్నారు. పదవులు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే కనపడుతున్నాయని, పనిచేసే వారికి అడ్డుపడుతూ వీరు ఏసీ గదుల్లో నుండి భయటకు రావటం లేదని విమర్శిస్తున్నారు.