-
అడ్డదిడ్డంగా పొట్ట కోసి, దూదికట్ట మర్చిపోయిన DR.కోటారాంబాబు
-
నిత్యచిత్రవధ అనుభవిస్తున్న ఎర్రుపాలెం TRSఅధ్యక్షుడి కుటుంబం
-
డబ్బు,పదవి కోసమే “పంబిసాంబ” అమ్ముడుపోయాడంటూ ప్రచారం
-
సాంబశివరావు భార్య ఆరోగ్యాన్ని నాశనం చేసింది చాలక దిగజారిన నిందలు
-
మానవత్వానికి మచ్చ తెచ్చేలా కోటారాంబాబు వ్యాఖ్యలు
-
పంబిసాంబశివరావు కుటుంబ పరువును బజారుకీడుస్తున్న “సోషల్ సైకో”
-
DR.కోటారాంబాబు కనుసన్నల్లో నడుస్తున్న “మధిరరచ్చబండ” ఫేస్బుక్ పేజ్
-
మధిరరచ్చబండ పేజ్ అడ్మిన్‌తో కోటారాంబాబుకు సన్నిహిత సంబంధాలు

పంబిసాంబశివరావు. స్వస్ధలం ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం అయినప్పటికి మధిర నియోజకవర్గంలో పేరున్న నేత. నిచ్చెనమెట్ల కులవ్యవస్ధలో వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉన్న నేత. ఎన్నాళ్లనుంచో తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించినప్పటికి మారిన రాజకీయసమీకరణాల నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు. ప్రస్తుతం ఎర్రుపాలెం మండల TRSఅధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంబి సాంబశివరావు అంటే ప్రజల మనిషి, తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ కార్యకర్తలు కానీ, తన సన్నిహితులు కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోయి..తనకు తోచిన సహాయం చేసే మనసున్నమనిషి. తన నాయకత్వ పటిమతో పాటు ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి అధిష్టానం ఆయనను ఎర్రుపాలెం మండల పార్టీ బాధ్యుడిగా నియమించింది. అయితే ఇదంతా పచ్చి అబద్దమేనా? పంబిసాంబశివరావు అసలు నాయకుడు కాదా? సామాన్యులను పీడించుకు తినే రాక్షసుడా? తన పదవికోసం, డబ్బుకోసం “సెంటిమెంట్ అస్త్రాన్ని” ప్రయోగిస్తూ దిగజారిపోయాడా? అంటే అవునంటున్నాడు “మధిర మున్నాభాయ్ డాక్టర్ కోటా రాంబాబు” అంతే కాదు ఆయనకు అడుగులు మడుగులు ఒత్తే సోషల్ సైకోల ద్వారా కూడా దుష్ప్రచారం చేయిస్తున్నాడు.


#పంబి సాంబశివరావు కుటుంబంపై కోటారాంబాబుకు ఎందుకంత పగ?
అది 2016 జులై నెల…పంబిసాంబశివరావు భార్య పంబి నాగమల్లీశ్వరి గర్భాశయ ఇన్ఫెక్షన్ కారణంగా మెరుగైన చికిత్సకోసం KVR ఎమర్జెన్సీ హాస్పిటల్ కు వెళ్లింది. ఆపరేషన్ చేయకుంటే ప్రమాదం అంటూ భయపెట్టిన DR.కోటారాంబాబు వచ్చిరానీ వైద్యంతో ఆమెకు ఆపరేషన్ చేసాడు. అంతేకాదు దూదికట్టలను ఆమె కడుపులో వదిలేసి నాగమల్లీశ్వరి పొట్టను బస్తా కుట్టినట్లు కుట్టేసాడు మధిర మున్నాభాయ్MBBS.ఈ “హాఫ్ నాలెడ్జ్ డాక్టర్” వల్ల ఆమె పొట్టలో ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ప్రాణం చేతపట్టుకుని నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే…5 ఆపరేషన్లు చేసి పోయే ప్రాణాన్ని దక్కించారు.అయినా సరే నేటికి ఆమె పొట్ట..పచ్చిగాయమే.ఆ కుట్ల నుంచి చీము, నెత్తురు కారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు డాక్టర్ కోటారాంబాబు. పంబిసాంబశివరావు కుటుంబానికి నిత్య నరకాన్ని కానుకగా ఇచ్చి ఊరేగుతున్న మహనీయుడు డాక్టర్ కోటారాంబాబు.తమకు, తమకుటుంబానికి జరిగిన అన్యాయాన్ని యావత్ ప్రపంచానికి చెప్పి తన “హాఫ్ నాలెడ్జ్”ను బయటవేసారనే అక్కసుతో అప్పటి నుంచి పంబి సాంబశివరావు కుటుంబంపై పగ పెంచుకున్నాడు డాక్టర్ కోటా రాంబాబు. డబ్బుకు అమ్ముడు పోయాడు, పదవి కోసం భార్యను బజారుకీడ్చాడు అంటూ తనకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో, వాట్స్ యాప్ గ్రూపుల్లో నిద్రలేకుండా ప్రచారం చేయించాడు. పంబి సాంబశివరావు కుటుంబం మౌనంగా భరించింది. ఈ మౌనాన్ని చేతకానితనంగా తీసుకున్న డాక్టర్ కోటారాంబాబు పంబిసాంబశివరావు ఆత్మగౌరవాన్ని,వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో రాతలు రాయిస్తున్నాడు. కడుపులో కాటన్ బ్యాండ్స్ మర్చిపోయి ఆమె జీవితాన్ని నాశనం చేయటం న్యాయమేనా అని నిలదీసిన వారికి … తప్పు ఒప్పుకోవాల్సింది పోయి, పంబిసాంబశివరావు కుటుంబంపై దుర్మార్గమైన నిందలు వేస్తున్నాడు. ( డాక్టర్ కోటారాంబాబు కాల్ రికార్డింగ్ వినండి ). ఇంతటితో ఆగిపోకుండా మధిర రచ్చబండ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా నేటికి వారి మీద బురదచల్లిస్తూ… పంబి సాంబశివరావు కుటుంబానికి చిత్రవధ చూపిస్తున్నాడు. ఇంకా చల్లారని పగను తన “సోషల్ సైకో”ల ద్వారా తీర్చుకుంటున్నాడు.

#సోషల్ సైకోలతో “డాక్టర్ కోటారాంబాబు” కు ఏం పని?
తన నియంతృత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు, తన అరాచకాలను ఎవ్వరూ నిలదీయకూడదు, అంతేకాదు తన అరకొర వైద్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపిస్తే, చట్టానికి తూట్లు పొడిచే తన మదాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే…వారి పరువు ప్రతిష్ఠలను బజారుకీడ్చాలి. వారిపై విషప్రచారం చేయించి ఆ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయించాలి. ఇది నేరుగా చేస్తే పోలీసులు ఊరుకోరు కనుక తన ప్రత్యర్ధులను, తనను నిలదీసే వారిని వేధించేందుకు డాక్టర్ కోటా రాంబాబు ఎంచుకున్న దారి సోషల్ మీడియా. తన హాఫ్ నాలెడ్జ్ వైద్యంతో బాధితులుగా మారిన వారు కేసుల వైపుకు పోకుండా తన అన్న “పోలీస్ కానిస్టేబుల్ రమేష్” ద్వారా బెదిరిస్తాడు.అట్రాసిటీ కేసులు పెడతానంటూ వేధిస్తాడు. మరో పక్క కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు…ముఖ్యంగా మాల,మాదిగ కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దుర్మార్గ స్ధితిని పెంచిపోషించాడు. ఆ వికృత రూపానికి సాక్ష్యమే “మధిర రచ్చబండ” అనే ఫేస్బుక్ పేజ్. ఇదే ఫేస్బుక్ పేజ్ అడ్మిన్ పంబి సాంబశివరావు కుటుంబంపై చేసిన కామెంట్ ఇందుకు సజీవసాక్ష్యం. జడ్పీ ఛైర్మన్ “లింగాల్ కమల్ రాజ్”ను గాజులు తొడుక్కున్నావా అంటూ కించపరచటం వరకు ఈ “సోషల్ సైకో వికృత రూపం” అంతా ఇంతా కాదు. మొదట్లో మధిర రచ్చబండ పేజ్‌కు ఒక రేంజ్లో అండదండలు అందించిన “కోటా రాంబాబు శిష్యులు”.. ఈ డర్టీ ఫేస్‌ను గుర్తించి దూరం జరిగారు. కులాల కుంపట్లు రగులుకునే అవకాశం ఉండటంతో ఇది సరికాదు తీరు మార్చుకో అని “మధిర రచ్చబండ ఫేస్బుక్ పేజ్ అడ్మిన్”ను హెచ్చరించారు. అయినా సరే సామరస్య వాతావరణాన్ని చెడగొట్టటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ సోషల్ సైకో రెచ్చిపోతున్నాడు.ఈ “సోషల్ సైకో” ఎవరో నాకు తెలుసు, ఇలా చేయటం సరికాదు అని హితవు పలికే ప్రయత్నం చేసినా,వాళ్ల బంధువులతో చెప్పించినా వినలేదు అంటూ సాగిన డాక్టర్ కోటా రాంబాబు వాట్స్ యాప్ ఛాట్ ను ఒకసారి చదవండి. దీన్ని బట్టి పంబి సాంబశివరావు కుటుంబంపై దిగజారిన రాతలు రాసి, కులగజ్జితో “జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్‌పై బురద చల్లిస్తూ, మాల మాదిగల మధ్య ఉన్న సోదరభావాన్ని హత్య చేసే కుట్రకు “తండ్రి” ఎవడనేది డాక్టర్ కోటా రాంబాబుకు తెలుసు అనేది ఇక్కడ సుస్పష్ఠం.


#అధికారులు ఇకనైనా స్పందిస్తారా లేక..?
నేను ఎవరనేది కనిపెట్టలేరు? అది ఎవ్వడి తరం కాదు? కనిపెట్టినా సరే ఏమి పీకలేరు? అని రెచ్చిపోతున్న “సోషల్ సైకో” మధిర రచ్చబండ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్‌తో డాక్టర్ కోటా రాంబాబు మధ్య కాల్ చేసి మాట్లాడుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నాడు. పెంచుకున్న పాము ఇప్పుడు కరుస్తోంది అనే భావంలో వాట్స్ యాప్ ఛాటింగ్ ద్వారా తన బాధ వెళ్లబుచ్చుకున్నాడు. ఇదే నిజమైతే…దుర్మార్గమైన పోస్టులతో రెచ్చిపోతున్న “మధిర రచ్చబండ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ ఎవరో చెప్పి…డాక్టర్ కోటా రాంబాబు తన నిజాయితీని నిరూపించుకుంటాడా? లేక ఇదంతా నటన…మాల మాదిగల మధ్య మంటలు పెట్టే కుట్రలో నేను ఒక భాగస్వామినే, పంబిసాంబశివరావు కుటుంబంపై నీచపు రాతలు రాయించింది నేనే, లింగాల కమల్ రాజ్ నుంచి జర్నోటీమ్ వరకు ఆ సోషల్ సైకో ద్వారా నిందలు వేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అని మరింతగా విర్రవీగుతారా ఇక తేలుతుంది. అయ్యా పోలీస్ ఉన్నతాధికారులు మీకొక విన్నపం..ఇప్పటి వరకు “మధిర రచ్చబండ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్” ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు కానీ మీకు ఉన్న ఇతర పనుల వల్ల కుదరకపోయి ఉండవచ్చు. మాల మాదిగల మధ్య వైరం పెంచి కులాల కుమ్ములాటలు,మత మారణహోమాలు చేసే కుట్రను “మధిర రచ్చబండ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్” చేస్తున్నారని సాక్ష్యాలతో సహా ఇస్తే, కోర్టు ఆదేశాలతో “జాంబవవారసులు” వాట్స్‌యాప్ గ్రూప్ పై ఒక FIR నమోదు చేసారు. ఇందుకు సంతోషమే కానీ…ఇదిగో ఇప్పుడు ఆ సోషల్ సైకో ఎవరో నాకు తెలుసు, నేను కాల్ చేసి మాట్లాడాను, పేజ్ తీసేయమని చెప్పాను, చెప్పించాను కానీ వినటం లేదు అని డాక్టర్ కోటా రాంబాబే చేసిన వాట్స్ యాప్ ఛాటింగ్ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. మరి ఇకనైనా “యాక్షన్” తీసుకుంటారా లేక కోర్టు ఆదేశాలు ఉంటేనే స్పందిస్తారా అనేది కాస్త బదులివ్వండి. ధర్మాసనం ఆదేశిస్తేనే అది జరుగుతుంది అంటే ఈ సాక్ష్యాలతో న్యాయస్ధానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమే. అంతకంటే ముందు మరింత బాధ్యతతో కాస్త పెద్ద మనసు చేసుకుని ప్రశాంతతకు నిలయమైన మధిరలో కులాల మధ్య కుమ్ములాటలు చోటు చేసుకోకుండా సోషల్ సైకోల భరతం పడతారని ఆశిస్తూ…. Vijaysadhu (Editor in Chief)