హైద‌రాబాద్ లో భూమి స్వ‌ల్పంగా కంపించింది

హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని ఆస్బెస్టాస్ కాల‌నీ ప్రాంతంలో భూ ప్ర‌కంప‌న‌లు జ‌రిగిన‌ట్లు స్థానికులు అంటున్నారు. భ‌యంతో వారంతా ఇళ్ల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని కాల‌నీ వాసులంటున్నారు. ఉద‌యం 9.25గంట‌ల‌కు భూమి కంపించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఇది భూకంప‌మేనా ? గ‌తంలో బోర‌బండ చుట్టు ప్ర‌క్క‌ల ప్రాంతాల్లో న‌మోదైన‌ట్లుగానే ఇక్క‌డ కూడా త‌వ్వ‌కాల ద్వారా కంపించిన‌ట్లుగా అనిపించిందా అన్న‌ది తెలియాల్సి ఉంది.