డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు

Tollywood Drugs Case Latest News

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ అధికారులు పూరి జగన్నాథ్‌ను 10 గంటలు, ఛార్మిని 8 గంటలు, రకుల్‌ను 6 గంటలు విచారించారు. ఈ ముగ్గురు తారల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు పరిశీలించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఢిల్లీ ఈడీ బృందం మానిటరింగ్ చేస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ, ఎన్‌సీబీ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్స్ కేసును విచారిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు, నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. కెల్విన్‌ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 22 వరకు పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే ఈ నెల 8న ఈడీ విచారణకు హీరో దగ్గుబాటి రానా కూడా హాజరుకానున్నారు.