డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను విడిచి వెళ్లే సమయం వచ్చినా ఆయన ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అనేక సమస్యలకు కారణమై ట్రంప్ 150 ఏళ్ల ఓ సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు. వైట్‌హౌస్‌కు కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి పాత అధ్యక్షుడు హాజరై శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ అయితే బైడెన్‌కు స్వాగతం చెప్పబోయేది లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.
గతంలో 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ కొత్త అధ్యక్షుడి ఎస్ గ్రాంట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాత 150 ఏళ్లకు మళ్లీ అలా జరగుతోంది. కాగా ట్రంప్ ప్రకటనపై ఇప్పటికే బైడెన్ తీవ్రంగా స్పందించారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు.