ఓటీటీలో టక్ జగదీష్.. నానిని ఫాలో అవుతున్న రానా, నాగచైతన్య!!

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఎంతగానో కుంగిపోయింది. స్టార్ హీరోల సినిమాల దగ్గర్నుండి చిన్న సినిమాల వరకు ప్రతి ఒక్కరు సమస్యల్ని ఎదుర్కోంటున్నారు. సెకండ్ వేవ్ తో సినిమా రిలీజ్ డేట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ సినిమాల రిలీజ్ పై కన్ఫ్యూజన్ ఎదురయ్యింది. ఈ క్రమంలో థియేటర్స్ ఒపెన్ అయినా ప్రేక్షకులు ఎంతవరకు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. అందుకే తమ సినిమాల రిలీజ్ పై ఓ క్లారిటీకి వచ్చారట. టక్ జగదీష్, విరాటపర్వం, లవ్ స్టోరీల సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని సెప్టెంబర్ లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు అన్నీ రకాల సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో నాగచైతన్య లవ్ స్టోరీ, రానా యాక్ట్ చేసిన విరాటపర్వం సినిమాలపై విపరీతమైన అటెన్షన్ తో పాటు సినిమా అప్డేట్స్ పై గ్రేట్ బజ్ ని క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల దర్శకనిర్మాతలు వారి సినిమాలను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్స్ మీద ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. వీటి గురించి త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. థర్డ్ వేవ్ కారణంగా త్వరలోనే మళ్ళీ థియేటర్లను మూసివేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు నెలల్లో ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.