చీవాట్లు అట, సెటైర్లు అట…ఇంకా నయ్యం లెంపకాయలు వెయ్యలేదా?

unknown Facts behind the dirty Cookedup

 

  • మంత్రి పువ్వాడ అజయ్‌ పై కేసీఆర్‌ ఆగ్రహం?

  • బస్సుల లెక్కలు చెప్పలేవా అని కేటీఆర్‌ సెటైర్లు?

  • కుర్చీకింద దాక్కున్నారా లేక బల్లకింద నక్కి ఉన్నారా?

  • ఆ పేపర్లకు మినిస్టర్ అజయ్ అంటే ఎందుకంత అక్కసు?

  • విమర్శలకు వాత పెట్టిన కేసీఆర్‌,కేటీఆర్‌

  • చెక్కు చెదరని కొండంత నమ్మకం, అజయ్‌కు కీలక బాధ్యతలు

"విజయగర్జన" విజయవంతానికి KTR గైడ్ లైన్స్
“విజయగర్జన” విజయవంతానికి KTR గైడ్ లైన్స్

చంకలు కొట్టుకున్నారు, జబ్బలు చరుచుకున్నారు,చెవులు కొరుకున్నారు, నొసలు ఎగరేసుకున్నారు…అబ్బో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి లెండి. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారని, బస్సుల లెక్కలు చెప్పలేవా? అని కేటీఆర్‌ సెటైర్లు వేసారంటూ కొన్ని పేపర్లు పనిగట్టుకుని మరీ రాసింది మొదలు… ఇదే అదనుగా భావించిన పువ్వాడ వ్యతిరేకులు ఆ సింగిల్ కాలమ్ వార్తలను మెడలో వేసుకుని ఊరేగారు. ఎన్నాళ్ల నుంచో కడుపులో దాచుకున్న గ్యాస్‌ ట్రబుల్‌ను ఒక్కసారిగా వదిలేసి ఊపిరి పీల్చుకున్నారు. TRSఅధినేత కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిసైడ్ అయిన సభ విజయగర్జన. పోరుఖిల్లా వరంగల్‌లో గర్జన నిర్వహించి తమపై అనవసర విమర్శలు చేసేవారి నోళ్లు మూయించాలనే వ్యూహమే వరంగల్ విజయ గర్జన వెనుక ఉన్న వార్ సీక్రెట్. ఈ నిర్వహణ సమావేశంలోనే వరంగల్ విజయ గర్జనను దాదాపు 10లక్షల మందితో జరిపి ఔరా అనిపించాలనేది గులాబీ బాస్ ప్లాన్‌. 10లక్షల మంది అంటే ఊరికే రారు కదా.. ఖచ్చితంగా రవాణా ఏర్పాట్లు చేయాల్సిందే. ఇదే బాధ్యత గురించి డిస్కస్ చేసారు టీఆరెస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.

మంత్రి అజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత KTR ప్రెస్ మీట్
మంత్రి అజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత KTR ప్రెస్ మీట్

#అసలు రవ్వంత… రాసింది కొండంత

నవంబర్ 15,10లక్షలమంది జనం, మిస్ కాకుండా ప్రతి ఊరికి ఒక బస్సు… ఇదీ గులాబీ దళపతి కేసీఆర్‌ “తెలంగాణ విజయగర్జన”ను విజయవంతం చేసేందుకు వేసిన స్కెచ్. స్వరాష్ట్ర సాధనకు కారకుడైన కేసీఆర్‌ స్కెచ్ గీస్తే అది ప్లాప్‌ అయిన చరిత్ర లేదు. ఇక ఆ నిర్వహణ బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారంటే… ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్లే అని సక్సెస్ ట్రాక్ రికార్డ్ డీజే సౌండ్‌లో దద్దరిల్లేలా చెబుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క..ఇక నుంచి ఒకలెక్క అని మీటింగ్ స్టార్టింగ్‌లోనే తేల్చేసిన కేసీఆర్…తెలంగాణ విజయగర్జన ధూంధాంగా జరగాల్సిందనే జోష్‌లో దళానికి దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇదే జోష్‌లో బస్సులు ఎన్ని ఉన్నాయి? జనాన్ని తరలించడానికి ఎన్ని బస్సులు అవసరమవుతాయని అడిగారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులది లేదా ఆర్టీసీ ఛైర్మన్‌ది. రవాణాశాఖామంత్రిది కానే కాదనేది మేధావులందరికి తెలిసిందే. అయినా సరే ఆ బాధ్యతను తీసుకున్నారు మినిస్టర్ అజయ్. ఇది చూసిన కేటీఆర్‌ కూడా అజయ్‌ను ఆటపట్టించేందుకు బస్సుల లెక్కలు లేవా అని అన్నారు. నేను రవాణా శాఖామంత్రిని బాస్‌ అని మినిస్టర్ అజయ్ కూడా జోవియల్‌గానే బదులిచ్చారు. అసలు జరిగింది అయితే…. మినిస్టర్ పువ్వాడ అజయ్ పై కేసీఆర్ ఆగ్రహం, మినిస్టర్ అజయ్ పై కేటీఆర్ అసంతృప్తి అంటూ… తోచినట్లు, నోటికి వచ్చినట్లు రాసేసాయి కొన్ని వార్తా పత్రికలు.

#రాయాల్సింది న్యూస్…రాసింది మాత్రం న్యూసెన్స్

Todays Newspaper is Tomorrows Wastepaper అనేది చాలా ఫేమస్ కొటేషన్. వేరే వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చేందుకు, సంచలనాల కోసం దిగజారిపోయి Cooked Up కథనాలు రాసిన అలాంటి వార్తా పత్రికలకు ఇలాంటి కొటేషన్లు సరిగ్గా సరిపోతాయి. కొన్ని అదృశ్య శక్తులు, మరికొందరు రాజకీయ నిరుద్యోగులు పువ్వాడ అజయ్‌పై విషం కక్కుతున్నారన్నది బహిరంగ రహస్యమే. వాళ్లే అక్కడ జరిగిన అసలు విషయానికి కాస్త మసాలా పూయించి లేనిపోని కథనాలు రాయించారనేది ఆఫ్‌ ది రికార్డ్ వాయిస్. వినయం నుంచి విధేయత వరకు, నిజాయితీ నుంచి పనితీరు వరకు పువ్వాడ అజయ్‌ పై పీకలవరకు పగ పెట్టుకున్న కొన్ని అదృశ్య శక్తులే ఈ న్యూసెన్స్‌ను న్యూస్‌గా రాయించాయనేది ఓపెన్ సీక్రెట్. మళ్లీ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి?

యే దోస్తీ హమ్ నహీ చోడేంగే...
యే దోస్తీ హమ్ నహీ చోడేంగే…

#అయ్యయ్యో…ఇప్పుడెలా మరి?

పువ్వాడ అజయ్. నిజం చెప్పాలంటే ఈ నేమ్ ఒక బ్రాండ్. నమ్మకం కుదరకపోతే అభివృద్ధికి ఐకానిక్‌ సింబల్‌గా నిలుస్తున్న ఖమ్మంను పలుకరిస్తే చెబుతది. ఒక నాడు ముక్కుపుటాలు పగిలిపోయే దుర్గంధాలు వెదజల్లిన ప్రాంతాలు నేడు పచ్చదనం పరుచుకుని వెల్ కమ్ చెబుతున్నాయి. ఆనాడు ముళ్ల కంపలతో భయాన్ని పుట్టించిన ప్రదేశాలు కాస్తా…నేడు అభివృద్ధి అంటే ఇదేరా అనుకునేట్లు చేస్తున్నాయి. ప్రజలకు పని చేయకూడదు, జనమంతా వెనుకబాటుతనంలోనే మగ్గిపోయేలా చేయాలనే కుట్రలు చేసే నేతలకు.. సహజంగానే పనిరాక్షసుడైన పువ్వాడ అజయ్ ఎలా నచ్చుతాడు? చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుపోయే “పోల్ మేనేజ్‌మెంట్ కింగ్” మినిస్టర్ అజయ్ ఎలా మింగుడు పడతాడు? వీటన్నింటికి మించి అంతులేని ప్రజాదరణతో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న యువనేత, కుతంత్రాలకు పురుడు పోసే అదృశ్య శక్తులకు పువ్వాడ అజయ్ కొరకరాని కొయ్యే కదా.. అందుకే అన్ని వండివార్చిన కథనాలు రాయించారు. ఎలా అయినా సరే ప్రజల్లో పువ్వాడ అజయ్‌కు ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలని భావించారు. తాము అనుకున్నది ప్రింట్ అయ్యాక, హమ్మయ్య తిక్క అణిగింది అని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ అంచనాలు తలకిందులు చేయటంలో మాస్టర్‌ మైండ్ అయిన కేసీఆర్‌, తన టీమ్‌లో ఎవరు ఉంటే విజన్‌ సాకారమవుతుందో స్పష్టంగా తెలిసిన కేటీఆర్‌, విధేయతకు, విశ్వాసానికి మారుపేరైన పువ్వాడ అజయ్‌కు బృహత్తర బాధ్యత అప్పగించారు. TRS అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న “తెలంగాణ విజయగర్జన”ను విజయవంతం చేసే కీలకబాధ్యతను మంత్రి అజయ్‌కు అప్పగించారు. జనసమీకరణ నుంచి నేతలను సమన్వయం చేసే కీరోల్‌ ను అజయ్‌కు అప్పగించి విమర్శకుల నోళ్లు మూయించారు. పాపం.. ఇది ఏ కోశాన అంచనా వేయని, వేయలేని అదృశ్య శక్తులు, వ్యతిరేకులకు నిద్రను దూరం చేసారు. నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయడు, బాధ్యత అప్పగిస్తే అంతకు మించి సక్సెస్‌ రేట్‌ను కానుకగా ఇస్తాడనే పేరు తెచ్చుకున్న పువ్వాడ అజయ్‌ ఎలాంటి రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తారో చూడాలి మరి….. By విజయ్ సాధు ( Editor in Chief)