శిష్యుడు కి గురువు ప్రేమతో రాసిన లేఖ.. వైరల్

బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన. హీరోగా వైష్ణవ్ తేజ్ కు దర్శకుడిగా బుచ్చిబాబు కు, ఇది మొదటి సినిమా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాదించడమేకాక మంచి కలెక్షన్లను కూడా సాధించింది. బుచ్చిబాబు క్రేజీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు. అయితే శిష్యుడు ప్రయోజకుడు అయితే గురువు కి ఉండే ఆనందం వేరేగా ఉంటుంది. ఈ చిత్రంతో విమర్శకులను సైతం మెప్పించి డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు బుచ్చిబాబు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ స్పందిస్తూ బుచ్చిబాబు నా పెద్దకొడుకు. నేను పుత్రోత్సాహం లో ఉన్నాను అని వేదిక పైన చెప్పాడు సుకుమార్. అయితే ఇప్పుడు సుకుమార్ తన శిస్యుడు బుచ్చిబాబుకు రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖ లో ఏముందో మీరు కూడా చదవండి.