వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడి ఫస్ట్ మూవీ. హీరోయిన్ గా క్రితి షెట్టి, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాలో లవ్ స్టోరీ, క్లీన్ రొమాన్స్ కనపడగా, హీరో హీరోయిన్లు చక్కగా సరిపోయారు. టీనేజ్ లవ్ స్టోరీని తెరకెక్కించినట్లు కనపడుతుండగా సినిమాకు సంగీతం చాలా ప్లస్ అయినట్లు తెలుస్తోంది.