మహేష్ బాబు తర్వాత ఆ క్రేజ్ ని సంపాదించుకుంది విజయ్ దేవరకొండనే..!!

యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. గీతగోవిందం సినిమాతో తన కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఈ హీరోని పాన్ ఇండియా స్టార్ గా మార్చనున్నారు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ మార్కెట్ లో ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోబోతున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైన నెల రోజులకే కరోనా విజృంభణ మొదలయ్యింది. దాంతో షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అందుకే అటు పూరీ జగన్నాథ్ కి, ఇటు విజయ్ దేవరకొండ సినిమాల లిస్ట్ లో గత రెండేళ్ళుగా లైగర్ సినిమాతో ఉన్నారు.

ఈ సినిమా కోసం విజయ్ మంచి ఫిజిక్ ని పెంచారు. సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడంతో యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఇక ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. సినిమాలతో కాకుండా వేరే విధంగా కవర్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్ లో ఓ గ్రాండ్ బ్రాండ్స్ ని తన లిస్ట్ లో వేసుకున్నారు విజయ్. మహేష్ బాబు తర్వాత తెలుగులో కమర్షియల్ బ్రాండ్స్ తో ఆదాయం సంపాదించేది విజయ్ దేవరకొండ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ముంబై కి వచ్చిన విజయ్ దేవరకొండ ఇంటి నుండే తన పనులు స్టార్ట్ చేసారు. ఇంట్లో పని మొదలుపెట్టేసా అంటూ లేటెస్ట్ యాడ్ షూటింగ్ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.