విజయ్ సేతుపతికి మరో మెగా ఆఫర్ వచ్చింది

Vijay Sethupathi got another mega offer
Vijay Sethupathi got another mega offer

రీసెంట్ గా విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి మంచి కలెక్షన్లను రాబడుతోంది. విజయ్ సేతుపతి కి తాజా సమాచారం ప్రకారం మరో మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించపోతున్నారు అని టాక్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి చాలా పవర్ ఫుల్ గా చూపించపోతున్నారు అని సమాచారం. డైరెక్టర్ బాబి మొదట వేరొకరిని అనుకున్నప్పటికీ చిరంజీవి మాత్రం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సూచించాడట. మరి ఈ సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి ఒప్పుకుంటారో లేదో చూడాలి.