ఫేస్ బుక్ ని బుక్ చేసిందెవరు?

Who booked Facebook?

 

200 కోట్ల మందికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. ఏసీలు ఆగిపోయినట్లు… అసలు కరెంటే పోయినట్లు అందరిలోనూ కలకలం… కొంతమంది అయితే ఏదో ఇంట్లోవాళ్ళు కరోనతో చనిపోయినట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరు గంటల పాటు ఈ పరిస్థితిలో లోకమంతా ఉండిపోయింది. మన లైఫ్ లో… సారీ… మన లైఫ్ మొత్తం అవే నిండిపోయాయి. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టందే నిద్రపట్టదు. వాట్సాప్ స్టేటస్ పెట్టందే టీ కూడా తాగం. ఇంస్టాగ్రామ్ లైక్స్ చూసుకోనిదే ఫుడ్ కూడా తినలేం.

అలాంటిది ఆ మూడు ఒక్కసారే ఆగిపోయాయి. అది కూడా ఆరు గంటలు. మన వాళ్లు అంతా గుండెలు బాదుకున్నారు. మనకంటే ఆ మూడిటి ఓనర్ అయిన జుకరబుర్గ్ ఇంకెంత టెన్షన్ పడ్డాడో. ఎందుకంటే బాస్ కీ 5 వేల కోట్ల పైనే ఈ ఆరు గంటల్లో స్టాక్స్ ఫసక్ అయిపోయాయి. వాడి ఆదాయం సంవత్సరానికి 6 లక్షల 41 వేల కోట్లు… రోజుకి 1756 కోట్లు .. ఇప్పుడు ఈ ఆరు గంటల్లో పోయింది 440 కోట్లు అన్నమాట.

మా సెక్యూరిటీ సూపర్ అని చెప్పినా.. ఇప్పుడు బాక్స్ బద్ధలైపోయింది. ఎందుకు ఇలా జరిగింది. అసలేం జరిగింది.

వాస్తవంగా చెప్పాలంటే ఏం జరిగిందో ఇంకా సరిగ్గా తెలియదు. మొత్తం అన్ని చోట్ల పోయిందంటే సర్వర్ లోనే దెబ్బ పడిందనేది ఓ కామన్ అబిప్రాయం. ఈ సర్వర్ మీద ఏం జరిగింది.. బీజీపీ.. అంటే బ్రాడ్ గేట్ వే ప్రోటాకాల్ .. దీనిని వారం నుంచి అప్ డేట్ చేస్తున్నారట. అయితే ఇది చేస్తున్న మ్యాపింగ్ లో పేస్ బుక్ , ఇన్ స్ట్రాగామ్ , వాట్సప్ కనపడకుండా పోయాయి. ఇది ఎలా జరిగింది… టెక్నికల్ మిస్టకా లేక ఎవరైనా కావాలని చేసారా తెలియదు.

మన అవసరాల కోసం .. మన తృప్తి కోసం అన్నిట్లో ఎంటరై పోయాం. కాని మన డేటాను అమ్ముకుని ఫేస్ బుక్ వాలా వ్యాపారం చేసుకుంటున్నాడు. మన పళ్లు టూత్ పేస్ట్ కంపెనీల వాళ్లకి, మన స్కిన్ కాస్మోటిక్ కంపెనీల వారికి, మన బట్టలు.. ఇంకా అన్నీ,,, రకరకాలు గా అమ్మేసుకుంటున్న ఈ బడా సేల్స్ కంపెనీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే. మన ఫీలింగ్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నాం. వాటినే పెట్టుబడిగా చేసుకుని… దానిని అనలైజ్ చేయడానికి యాప్స్ తయారు చేసుకుని… డేటా రిపోర్టులను తీస్తున్నాడు. వాటిని వేలం పెట్టిన రేంజులో అమ్ముతున్నాడు.

మన డేటాను అమ్మే దగ్గర .. బేరాలు కుదరని వాడు .. జుకర్ బర్గ్ మరీ ఎక్కువ వసూలు చేస్తున్నాడని వళ్లు మండి కూడా ఈ పని ఎవడైనా చేసి ఉండొచ్చు.

ఇన్ని కోట్ల మంది దేటా ఒకే దగ్గర దొరకడం అంత ఈజీ కాదు. ఇంత డేటాను దశాబ్దాలుగా కలెక్ట్ చేసుకున్న ఫేస్ బుక్… దానిని విజయవంతంగా అమ్ముకుంటోంది. మనకు ఫ్రీడమ్ దొరికిందని మనం ఫీలయ్యాం… స్నేహితులు దొరుకుతున్నారని ఆనందపడ్డాం.. కాని వాడి వ్యాపారంలో వాటా లేని, లాభం రాని పార్టనర్లుగా మనం చేరుతున్నామని మనకెవరికీ తెలియటం లేదు.

ఇప్పుడు వాడి దగ్గరున్న డేటాకు సెక్యూరిటీ లేదని తెలుస్తోంది. రేపు ఎవడైనా ఆ డేటాను వీడి దగ్గర కొట్టేస్తే.. వాడు ఆ డేటాను ఇంకో రకంగా వాడితే.. అప్పుడు మన పరిస్థితి ఏంటి.. విశాల్ చేసిన అభిమన్యుడు సినిమాలో అర్జున్ చేసినట్లు ఆ డేటాను సైబర్ క్రైమ్ కి వాడుకుంటే మన గతేంటి…ఇవే అనుమానాలు ఆలోచనలు అందరినీ పట్టి పీడిస్తున్నాయి.

పైగా ఇంత జరిగితే ఒక సారీ చెప్పేసి ఊరుకున్నాడు మహానుభావుడు. అసలేం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా.. పైగా మనతో ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటూ.. మనకు జరిగిందేమిటో చెప్పకపోతే ఎలా?