స్కిప్పింగ్ చేస్తే ఎత్తు పెరుగుతారా?

Will increase in height if skipping

 

చాలామంది హైట్ గా ఉండాలని కోరుకుంటారు. పొట్టిగా ఉంటే అదో లోపంగా ఫీలవుతుంటారు. అయితే ఒక మనిషి కొంత వయసు వచ్చాక వారి ఎత్తు పెరగడం ఆగిపోతుంది. సాధారణంగా తల్లిదండ్రుల హార్మోన్స్ బట్టి వాళ్ల పిల్లలు పొట్టిగా, పొడవుగా పెరుగుతారు. మరికొంతమంది తినే తిండిలో సరైన పోషకాలు అందకపోవడం వల్ల పొట్టిగానే ఉండిపోతారు. అయితే చిన్నతనంలో స్కిప్పింగ్ చేస్తే మంచి హైట్ ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చిన్నతనంలోనే పౌష్టికాహారం, వ్యాయామం చేయడం వల్ల పొడవు పెరిగే అవకాశాలు ఉన్నాయి. టీనేజీలో ఎంటర్ అయ్యే దశలోనే పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఎముకలు, కండరాలు పెరుగుతాయి. అందుకే చిన్నప్పటి నుంచి స్కిప్పింగ్ వంటి వ్యాయామం చేయాలి. చాలా మందికి స్కిప్పింగ్ చేయడం వల్ల ఎత్తు పెరుగుతారా అనే డౌట్ ఉంది. రోప్‌తో స్కిప్పింగ్ చేయడం అనేది సాధారణంగా అందరూ చేస్తుంటారు. స్కిప్పింగ్ చేసేటప్పుడు తల నుంచి కాలి వరకు కణాలు ప్రేరేపితమవుతాయి. దీనిద్వారా శరీర కణాలు చురుకుగా పని చేస్తాయి. దీంతో ఎత్తు పెరగడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం సాయంత్రం స్కిప్పింగ్ చేసినా.. లేదా రోజుకు ఒక పది, పదిహేను నిమిషాలు చేసినా సరిపోతుంది. స్కిప్పింగ్‌తోపాటు వారంలో మూడుసార్లు స్విమ్మింగ్ కూడా చేస్తే మరింత ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు శరీర భాగాలన్నీ కదిలి.. శరీర కణాలు ఉత్తేజితమవుతాయి. ఇది కూడా ఎత్తును పెంచేందుకు ఉపయోగపడుతుంది.

స్కిప్పింగ్ ,స్విమ్మింగ్ తో పాటు పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరల్లో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చిన్నపిల్లలు ఆకుకూరలు తినేలా ప్రోత్సాహించాలి. అలాగే పాలతో తయారైన ఉత్పత్తులను తినేలా చూడాలి. పాలతో తయారైన పదార్థాలతో ఎత్తు పెరగడంతోపాటు ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. పాలల్లో ఉండే కాల్షియం, విటమిన్లు శరీర ఎత్తు పెరగడానికి దోహదపడతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి. వీటిలో ఉంటే ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్లు శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి