
ప్రభాస్ హీరోగా తొలిసారిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఈ సినిమా లో విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నారు.. అభిమానులు ఎంతగానో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పిక్చర్ లో లవర్ బోయ్ గా ప్రభాస్ కనిపించనున్నారు.
ఈ సినిమాని UV క్రియేషన్స్ మరియు T సీరీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఫిబ్రవరి 14 వ తేదీన ఉదయం 9:18 గంటలకు విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ డైలాగ్ ఉంటుందా అంటూ పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా గా విడుదల కానుంది.