ఎన్నికల ముందు యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ..!

yogi adityanath latest news today

 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఉత్తర ప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో.. కేంద్రంలో కూడా అదే పార్టీ చక్రం తిప్పుతున్న అనేది అన్ని రాజకీయ పార్టీల నమ్మకం. అందుకే యూపీ ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీ అసెంబ్లీ కి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు యూపీలో అధికారంలో ఉన్న బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే తెలుస్తుంది.

ఆదివారం ఉదయం లఖింపూర్ ఖేరి ప్రాంతంలో జరిగిన ఘటన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే అంతంతమాత్రం ప్రజాదరణ ఉన్న యోగి సర్కార్ కు లక్కీ పూర్ ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన సమయంలో రైతులపై కి కార్ దూసుకెళ్లడం ప్రమాదానికి కారణమైన. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కార్ తో దూసుకెళ్లడంతో.. నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఆందోళనలో మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో లఖింపూర్ ఖేరి ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది.

రైతులు ఆందోళన కాస్త రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రియాంక కు మద్దతుగా యూపీ చేరుకున్న ఛత్తిస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ లో ఎయిర్ పోర్ట్ లో నాటుతున్నారు యూపీ పోలీసులు. అలాగే ఆందోళనకు అవకాశం ఉంది అంటూ లఖింపూర్ ఖేరి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.

ఇప్పటికే అంతంత మాత్రం ప్రజాదరణతో నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరుకు ఇదో మాయని మచ్చగా మిగిలిపోయింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజలకు కనీస వైద్య సౌకర్యం కూడా కల్పించలేక పోవడం వల్లే యూపీలో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని యోగి సర్కార్ పై ఆరోపణలున్నాయి. ఒక దశలో ఎన్నికలకు ముందు యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా బీజేపీ అధిష్టానం భావించింది. అటు యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏకంగా 30 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తోంది. తాజాగా రెండు రోజుల పాటు వారణాసి నియోజకవర్గంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ… యూపీ కి వరాల జల్లు కురిపించారు.

బిజెపికి లఖింపూర్ ఖేరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తలాయ్ ప్రాంతం.. ప్రస్తుతం యోగి సర్కార్ పై గుర్రుగా ఉంది. తలాయ్ పరిధిలోని ఆరు జిల్లాలు మొదటినుంచి బిజెపికి మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ ప్రస్తుత ఆందోళనలతో.. లఖింపూర్ ఖేరి ప్రాంతంలోని రైతులు, ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు రాకేష్ ను బిజెపి నేతలు ఆశ్రయించారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు కీలకంగా వ్యవహరించిన రాకేష్… బాధిత రైతులకు 45 లక్షల రూపాయల పరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించేలా ఒప్పందం కుదిర్చారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలా ఆందోళన జరగడం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.