
నందమూరి బాలకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ చాలా దారుణ ఓటమి పాలు అయినప్పటికీ హిందూపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా గెలిచారు. అయితే హిందూపురం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ కి ఎదురు దెబ్బ తగిలింది. 38 స్థానాల్లో 30 చోట్ల YSRCP మద్దతు దారులు భారీ విజయం పొందినారు. అయితే మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి, ఆయన సొంత పంచాయతీ అయిన పెనుకొండ లోని 80 స్థానాల్లో 71 YSRCP మద్దతు దారులు విజయం పొందినారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మరొకసారి ప్రజల పార్టీ అని అర్దం అవుతుంది.